చైనా యుద్ధ విమానాన్ని లాక్ చేసిన తైవాన్ ఎఫ్ 16 యుద్ధ మేఘాల మధ్య అమెరికా కీలక వ్యాఖ్యలు

చైనా యుద్ధ విమానాన్ని లాక్ చేసిన తైవాన్ ఎఫ్ 16 యుద్ధ మేఘాల మధ్య అమెరికా కీలక వ్యాఖ్యలు

తైవాన్ సరిహద్దుల్లో చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలతో డ్రాగన్ దేశం మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. చైనా చర్యలు ప్రాంతీయ సుస్థిరతను దెబ్బతీస్తున్నాయని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్రమంలో తైవాన్ రక్షణ శాఖ విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. తైవాన్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానం, చైనా జే 16 విమానాన్ని తన రాడార్ పరిధిలో లాక్ చేసింది. అంటే ఒక్క క్లిక్‌తో శత్రు విమానాన్ని కూల్చివేసే సామర్థ్యాన్ని తైవాన్ ప్రదర్శించి, చైనాకు గట్టి సవాల్ విసిరింది.

తైవాన్‌ను చైనాలో విలీనం చేయడం ఖాయమని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రకటించగా, తైవాన్ ప్రభుత్వం దీనిని రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించింది. అమెరికా ఇప్పటికే తైవాన్‌కు భారీ ఆయుధ ప్యాకేజీని ప్రకటించి అండగా నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలను చైనా పాత ఎత్తుగడలుగా కొట్టిపారేసినప్పటికీ, తైవాన్ వాయుసేన ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభ చైనాను ఆత్మరక్షణలో పడేసింది. ఈ పరిణామాలు తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *