మీ ఐఫోన్ పాతబడిపోతోందా? యాపిల్ వింటేజ్ జాబితాలో కీలక మార్పులు

మీ ఐఫోన్ పాతబడిపోతోందా? యాపిల్ వింటేజ్ జాబితాలో కీలక మార్పులు

యాపిల్ తన ‘వింటేజ్’ (Vintage) ఉత్పత్తుల జాబితాను తాజాగా అప్‌డేట్ చేస్తూ, అందులో ఐఫోన్ 11 ప్రో మరియు యాపిల్ వాచ్ సిరీస్ 5 వంటి ప్రముఖ పరికరాలను చేర్చింది. ఏదైనా ప్రోడక్ట్ అమ్మకాలు నిలిపివేసి 5 ఏళ్లు దాటితే యాపిల్ దానిని వింటేజ్ కేటగిరీలో చేరుస్తుంది. ఐఫోన్ 11 ప్రో ప్రస్తుతం లేటెస్ట్ iOS 26 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నప్పటికీ, వింటేజ్ జాబితాలోకి రావడం వల్ల అధికారిక రిపేర్ సర్వీసుల విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

వింటేజ్ జాబితాలో ఉన్న పరికరాలకు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే యాపిల్ సర్వీస్ సెంటర్లు రిపేర్ చేస్తాయి. ఒకవేళ పార్ట్స్ లేకపోతే కంపెనీ ఎటువంటి సహాయం చేయదు. సాధారణంగా అమ్మకాలు నిలిపివేసిన 7 ఏళ్ల తర్వాత ప్రోడక్ట్‌ను ‘అబ్సోలీట్’ (Obsolete) గా పరిగణిస్తారు. ఆ దశకు చేరుకున్న తర్వాత, యాపిల్ సంస్థ సదరు పరికరాలకు సంబంధించిన అన్ని రకాల హార్డ్‌వేర్ సపోర్ట్‌ను పూర్తిగా నిలిపివేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *