సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా మారింది శివుడిని అవమానించినందుకు పార్వతీ దేవి ఇచ్చిన శాపం
January 2, 2026

శివ పురాణం ప్రకారం పార్వతీ దేవి పరమశివుడిని భర్తగా పొందడానికి సముద్ర తీరంలో ఘోర తపస్సు చేశారు. ఆమె తేజస్సును చూసి మోహించిన సముద్ర దేవుడు తనను వివాహం చేసుకోవాలని కోరాడు. పార్వతీ దేవి ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించగా, అహంకారంతో సముద్ర దేవుడు శివుడిని భస్మధారి అని అవమానించాడు. తన తీపి నీరు లోకానికి ప్రాణాధారమని గర్వంగా చెప్పుకున్నాడు.
మహదేవుని పట్ల సముద్ర దేవుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు పార్వతీ దేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ తీపి నీటిని చూసి నువ్వు ఇంతలా గర్విస్తున్నావో, అది ఈ రోజు నుండి తాగడానికి వీలు లేకుండా పోతుందని ఆమె శపించింది. తల్లి ఇచ్చిన ఆ శాపం వల్లే సముద్రపు నీరు శాశ్వతంగా ఉప్పగా మారిపోయింది. ఇలా పార్వతీ దేవి సముద్రుని అహంకారాన్ని అణచివేసింది.