కాళ్లతో ఫోటోకాపీ షాపు నడుపుతున్న అసాధారణ యువతి అమితాబ్ బచ్చన్ ను మెప్పించిన వందన పోరాటం

కాళ్లతో ఫోటోకాపీ షాపు నడుపుతున్న అసాధారణ యువతి అమితాబ్ బచ్చన్ ను మెప్పించిన వందన పోరాటం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వందన 80 శాతం శారీరక వైకల్యాన్ని అధిగమించి స్వయం ఉపాధితో ఆదర్శంగా నిలుస్తోంది. బీకామ్ పూర్తి చేసిన ఈమె జెట్‌పూర్‌లో ఫోటోకాపీ షాపు నడుపుతూ తన కాళ్లతోనే కంప్యూటర్, జిరాక్స్ మెషీన్లను ఆపరేట్ చేస్తోంది. సమాజం తనను తక్కువగా చూసినా కుంగిపోకుండా, తల్లి ప్రోత్సాహంతో సొంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె అంకితభావం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

వందన పట్టుదలకు ముగ్ధుడైన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆమెకు స్వయంగా లేఖలు రాస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అమిత్ జీకి వీరాభిమాని అయిన వందన, ఆయన పంపే సమాధానాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. శారీరక లోపాలను జయించి ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్న వందన అంతిమ కోరిక ఒక్కసారైనా తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రత్యక్షంగా కలవడం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *