స్మార్ట్‌ఫోన్ మానవజాతికి శాపంగా మారుతుందా బాబా వంగా సంచలన జోస్యం

బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా దశాబ్దాల క్రితమే చిన్న చిన్న పరికరాల వల్ల మానవ ప్రవర్తన మారిపోతుందని అంచనా వేశారు. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో ఈ మాటలు అక్షర సత్యమవుతున్నాయి. ఎన్సీపీసీఆర్ నివేదిక ప్రకారం, 24 శాతం మంది పిల్లలు నిద్రపోయే ముందు మొబైల్ వాడుతున్నారు, ఇది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరికరాలపై అతిగా ఆధారపడటం వల్ల ఏకాగ్రత తగ్గిపోవడమే కాకుండా సంబంధాల మధ్య దూరం పెరుగుతోంది.
సోషల్ మీడియా రీల్స్ మరియు నిరంతర స్క్రోలింగ్ వల్ల పెద్దల్లోనూ ఆందోళన, నిరాశ వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం, మొబైల్ వాడకం వల్ల శారీరక నొప్పులు మరియు నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతికతకు బానిసలవ్వడం వల్ల భవిష్యత్తులో మానసిక ఆరోగ్య విపత్తు సంభవించే అవకాశం ఉందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.