మోదీ సర్కార్ భారీ ప్రాజెక్టు పశ్చిమ మరియు దక్షిణ భారతం మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ. 19,142 కోట్ల అంచనా వ్యయంతో 374 కి.మీ పొడవైన నాసిక్-సోలాపూర్ 6-లేన్ హైవే కారిడార్‌కు ఆమోదం లభించింది. సూరత్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌లో భాగంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు నాసిక్, అహల్యానగర్ మరియు సోలాపూర్ జిల్లాలను అనుసంధానిస్తుంది. రాబోయే రెండేళ్లలో పూర్తికానున్న ఈ రహదారి వల్ల నాసిక్ మరియు సోలాపూర్ మధ్య ప్రయాణ దూరం 14 శాతం మేర తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
ఈ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మరియు సమృద్ధి మహామర్గ్తో అనుసంధానించబడటం వల్ల సూరత్ నుండి చెన్నైకి ప్రయాణ సమయం 45 శాతం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటితో పాటు ఒడిశాలోని కోరాపుట్ నుండి మోహనా వరకు హైవే విస్తరణ పనుల కోసం రూ. 1,526 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది.