ఝాన్సీలో సీబీఐ మెరుపు దాడి కోటిన్నర లంచం తీసుకుంటూ డిప్యూటీ కమిషనర్ సహా ఐదుగురు అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో జరుగుతున్న భారీ అవినీతి నెట్‌వర్క్‌ను సీబీఐ అధికారులు ఛేదించారు. జీఎస్టీ ఎగవేత కేసులో ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు 1.5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసిన కేసులో డిప్యూటీ కమిషనర్ ప్రభా భండారీ, ఇద్దరు సూపరింటెండెంట్లు, ఒక లాయర్ మరియు వ్యాపారిని అరెస్ట్ చేశారు. డిప్యూటీ కమిషనర్ సూచన మేరకు 70 లక్షల రూపాయలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఈ సోదాల్లో ఇప్పటివరకు 1.6 కోట్ల రూపాయల నగదు, భారీగా బంగారం మరియు ఆస్తి పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. నిందితులందరిపై కేసు నమోదు చేసి త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకున్న అవినీతిపై సీబీఐ జరిపిన ఈ మెరుపు దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితుల నివాసాల్లో మరిన్ని తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.