పరాయి మహిళ వేధింపులు తట్టుకోలేక నలుగురు పిల్లల తండ్రి ఆత్మహత్య

పరాయి మహిళ వేధింపులు తట్టుకోలేక నలుగురు పిల్లల తండ్రి ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పొరుగున ఉండే మహిళతో ఏర్పడిన పరిచయం కాస్తా వేధింపులకు దారితీయడంతో, నలుగురు పిల్లల తండ్రి అయిన బీరంచంద్ బలవన్మరణానికి పాల్పడ్డారు. నిందితురాలు తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తోందని, ఆ మానసిక ఒత్తిడి భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చనిపోయే ముందు బీరంచంద్ ఒక వీడియో రికార్డ్ చేశారు, అందులో సదరు మహిళ తనను ఎలా ఇబ్బంది పెడుతుందో వివరించారు. ఈ వ్యవహారంపై మృతుడి భార్య దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లభ్యమైన ఆడియో, వీడియో ఆధారాలను పరిశీలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *