శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 5 ట్యాంకులు

శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 5 ట్యాంకులు

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా, రష్యా, భారత్ వంటి దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్యాంకులలో అమెరికాకు చెందిన ఎం1ఏ2 అబ్రమ్స్ అగ్రస్థానంలో ఉంది. ఇది క్షిపణులను మరియు డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. జర్మనీకి చెందిన లెపార్డ్ 2ఏ7 ట్యాంకు దాని వేగం మరియు శక్తివంతమైన సెన్సార్లకు ప్రసిద్ధి చెందింది. అటు ఆసియాలో అత్యంత ఖరీదైన మరియు ఆధునిక ట్యాంకుగా దక్షిణ కొరియాకు చెందిన కే-2 బ్లాక్ పాంథర్ నిలిచింది.

ఇజ్రాయెల్ తయారు చేసిన మెర్కావా మార్క్ IV ట్యాంకు సైనికులకు గరిష్ట రక్షణ కల్పించడంలో మేటిగా పేరుగాంచింది. అయితే రష్యాకు చెందిన టీ-14 అర్మాటా ట్యాంకు మనుషులు లేకుండానే పనిచేయగలదు. ఈ అత్యాధునిక ట్యాంకు సాంకేతికతను భారత్‌కు అందించేందుకు రష్యా ఇప్పటికే ప్రతిపాదించింది. కొండలు, మైదానాలు లేదా ఎడారులు ఏదైనా సరే, శత్రువులను క్షణాల్లో అటాక్ చేయగల ఈ ఐదు ట్యాంకులు నేడు ప్రపంచ రక్షణ రంగంలోనే అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *