BYD సంచలనం: 5 నిమిషాల్లో 470 కి.మీ రేంజ్!

BYD సంచలనం: 5 నిమిషాల్లో 470 కి.మీ రేంజ్!

ఎలక్ట్రిక్ వాహన రంగంలో చైనా దిగ్గజం BYD కొత్త విప్లవాత్మక టెక్నాలజీని ప్రవేశపెట్టింది. కేవలం 5-8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా 5 నిమిషాల ఛార్జింగ్‌తో కారు 470 కి.మీ ప్రయాణించగలదని వెల్లడించింది.

ఈ టెక్నాలజీకి అనుగుణంగా చైనా వ్యాప్తంగా 4,000 అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు BYD ప్రకటించింది. ఈ ముందడుగు ప్రపంచ EV మార్కెట్‌లో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీగా మారనుంది. అత్యాధునిక బ్యాటరీలు, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో BYD గ్లోబల్ EV రంగాన్ని మళ్లీ నిర్వచించేలా ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *