రాత్రి వేళ ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడికి ఊహించని షాక్
December 30, 2025

హిమాచల్ ప్రదేశ్‌లోని సుగంధ్‌పూర్‌లో ఒక యువకుడు తన ప్రియురాలిని కలవడానికి అర్ధరాత్రి 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లాడు. వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా యువతి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే వారిని కొట్టకుండా హిందూ సంప్రదాయం ప్రకారం వెంటనే అక్కడికక్కడే పెళ్లి జరిపించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ జంట ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి నచ్చినట్టు ఉండే హక్కు ఉందని తెలిపారు. రెండు వర్గాల నుండి ఫిర్యాదులు అందాయని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరికీ ఇలాంటి పరిస్థితుల్లో వివాహం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.