చలికాలంలో చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధరలు అసలు కారణం ఇదే
December 29, 2025

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర 8 రూపాయలు అంతకంటే ఎక్కువగానే పలుకుతోంది. ఉత్తరప్రదేశ్ పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు నవాబ్ అక్బర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో గుడ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది.
కేవలం డిమాండ్ మాత్రమే కాకుండా రవాణా ఖర్చులు కూడా గుడ్ల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వివిధ ప్రాంతాలకు సరుకును చేరవేయడానికి అయ్యే అదనపు ఖర్చుల వల్ల సామాన్యులపై భారం పడుతోంది. వెరసి చలికాలం పెరిగిన డిమాండ్ మరియు రవాణా వ్యయాలు కలిసి మార్కెట్‌లో గుడ్ల ధరలను ఆకాశానికి చేర్చాయి.