మాల్ టాయిలెట్‌లో సిగరెట్ తాగితే అంతే సంగతులు ఇక అంతా క్లియర్ గా కనిపిస్తుంది

మాల్ టాయిలెట్‌లో సిగరెట్ తాగితే అంతే సంగతులు ఇక అంతా క్లియర్ గా కనిపిస్తుంది

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని రెండు ప్రముఖ షాపింగ్ మాల్‌లలో పురుషుల టాయిలెట్లకు వినూత్నమైన గ్లాస్ డోర్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా అపారదర్శకంగా ఉండే ఈ అద్దాలు, లోపల ఎవరైనా పొగతాగడం ప్రారంభిస్తే కేవలం సెకన్లలోనే పారదర్శకంగా మారిపోతాయి. దీంతో లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తాడు. మీరు ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వకూడదనుకుంటే లోపల సిగరెట్ తాగకండి అంటూ అక్కడ అధికారులు హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

సోషల్ మీడియాలో ఈ వింత టెక్నాలజీపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని అరికట్టడానికి ఇది సరైన మార్గమని చాలామంది ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ధూమపాన ప్రియులకు చెక్ పెట్టేందుకు చైనా మాల్స్ అవలంబిస్తున్న ఈ కొత్త పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *