న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్‌తో పాటు ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్‌తో పాటు ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం

కొత్త ఏడాదిలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పనిభారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే హార్దిక్ పాండ్యా దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశం ఉంది.

మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. జనవరి 3 లేదా 4 తేదీల్లో నిర్వహించే ఆన్‌లైన్ సమావేశంలో సెలెక్టర్లు ఈ సిరీస్‌కు సంబంధించి తుది జట్టును ఖరారు చేయనున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *