మేనల్లుడిని పెళ్లాడిన మేనత్త, భర్తకు ఫోటోలు పంపి షాక్ ఇచ్చిన వివాహిత
December 31, 2025

బీహార్‌లోని బాంకా జిల్లాలో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. పదకొండేళ్ల వైవాహిక బంధాన్ని, ఇద్దరు పిల్లలను వదిలేసి పూనమ్ కుమారి అనే మహిళ తన దూరపు మేనల్లుడు అంకిత్ కుమార్‌తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా, దేవాలయంలో జరిగిన తన పెళ్లి ఫోటోలను భర్త శివమ్ కుమార్‌కు ఫోన్ ద్వారా పంపి షాక్‌కు గురిచేసింది. ఈ అక్రమ సంబంధం ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
తన పిల్లల క్షేమం కోరుతూ బాధితుడు శివమ్ అమర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య మోసాన్ని తట్టుకోలేక, తన బిడ్డలను తనకు అప్పగించాలని ఆయన పోలీసులను వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ మహిళ మరియు పిల్లల కోసం పోలీసులు గాలిస్తున్నారు.