సోషల్ మీడియాలో ఇతర మహిళల ఫోటోలకు లైక్ కొడితే విడాకులు మంజూరు కోర్టు సంచలన తీర్పు
January 2, 2026

సోషల్ మీడియాలో ఇతర మహిళల ఫోటోలు లేదా పోస్టులపై నిరంతరం ‘లైక్’ చేయడం వైవాహిక బంధానికి ద్రోహం చేయడమేనని టర్కీ సుప్రీం కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ సంచలన తీర్పునిచ్చింది. భర్త చేసే ఇటువంటి పనులు భార్యను అవమానించడమే కాకుండా వివాహ బంధంలో ఉండాల్సిన విశ్వసనీయతను ఉల్లంఘించడమని కోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో మారుతున్న విడాకుల నిబంధనలకు ఈ తీర్పు అద్దం పడుతోంది.
తన భర్త సామాజిక మాధ్యమాల్లో ఇతర మహిళల ఫోటోలపై లైక్లు కొడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. భర్త ప్రవర్తన వల్ల భార్య మానసిక వేదనకు గురైందని భావించిన న్యాయస్థానం ఆమెకు పరిహారం మరియు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో సోషల్ మీడియా కార్యకలాపాలు కూడా ఇకపై విడాకుల కేసుల్లో కీలక ఆధారాలుగా మారనున్నాయి.