కేవలం 21 ఏళ్లకే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈ యువతి పరిస్థితి చూస్తే వెపింగ్కు దూరంగా ఉంటారు
January 2, 2026

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన కెల్లీ బోడా అనే 21 ఏళ్ల యువతి, తన 15 ఏళ్ల వయసు నుంచే ఈ-సిగరెట్ లేదా వెపింగ్కు అలవాటు పడింది. మొదట్లో సాధారణ దగ్గుగా భావించినా, క్రమంగా పరిస్థితి విషమించి దగ్గుతో పాటు రక్తం రావడం మొదలైంది. దీంతో వైద్యులు ఎక్స్-రే మరియు వరుసగా ఏడు బయాప్సీలు నిర్వహించగా, కెల్లీ మూడవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది.
ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా కెల్లీకి శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తులలో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. కీమోథెరపీ వల్ల కలిగే నరకయాతనను అనుభవించిన ఆమె, ఇప్పుడు యువతను ఈ అలవాటుకు దూరంగా ఉండమని హెచ్చరిస్తోంది. సరదాగా మొదలయ్యే వెపింగ్ ప్రాణాల మీదకు తెస్తుందని ఆమె తన అనుభవం ద్వారా వివరిస్తోంది.