పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు ఎవరు తీర్చాలో మీకు తెలుసా
December 28, 2025

పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి గడువు తీరకముందే మరణిస్తే, బ్యాంకులు ముందుగా కో-ఆప్లికెంట్ లేదా గ్యారంటర్ కోసం చూస్తాయి. సహ-రుణగ్రహీత ఉంటే వారు సమాన బాధ్యత వహించాలి, ఒకవేళ గ్యారంటర్ ఉంటే వారు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎవరూ లేని పక్షంలో, రుణగ్రహీతకు చెందిన ఆస్తుల ద్వారా బ్యాంకులు ఆ బకాయిలను వసూలు చేసుకునేందుకు చట్టపరంగా ప్రయత్నిస్తాయి.
రుణగ్రహీత వారసులు ఈ అప్పుకు నేరుగా బాధ్యులు కారు. వారు లోన్ పత్రాలపై సంతకం చేసి ఉంటే తప్ప, వారి వ్యక్తిగత ఆస్తుల నుండి బ్యాంకులు రికవరీ చేయలేవు. అయితే, వారసత్వంగా వచ్చే ఆస్తుల ద్వారా అప్పు తీర్చే అవకాశం ఉంటుంది. సరైన పూచీకత్తు లేని పక్షంలో వారసుల సొంత సంపాదనను బ్యాంకులు తాకలేవని చట్టం చెబుతోంది.