కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి 1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న “కన్నప్ప” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నాడు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ మార్చి 1న విడుదల కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది.