పాకిస్థాన్‌కు ఘోర అవమానం ఇస్లామాబాద్‌ అడుగుపెట్టని యూఏఈ అధ్యక్షుడు విమానాశ్రయం నుంచే వెనుతిరగడంతో ప్రభుత్వం షాక్

పాకిస్థాన్‌కు ఘోర అవమానం ఇస్లామాబాద్‌ అడుగుపెట్టని యూఏఈ అధ్యక్షుడు విమానాశ్రయం నుంచే వెనుతిరగడంతో ప్రభుత్వం షాక్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాకిస్థాన్ పర్యటన ఆ దేశ ప్రభుత్వానికి తీరని అవమానాన్ని మిగిల్చింది. రావల్పిండి విమానాశ్రయంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ ఆయనకు స్వాగతం పలికినప్పటికీ ఆయన ఇస్లామాబాద్‌ వెళ్లడానికి నిరాకరించారు. విమానాశ్రయంలోనే కొద్దిసేపు చర్చలు ముగించుకుని నేరుగా రహీమ్ యార్ ఖాన్‌లోని తన వ్యక్తిగత కార్యక్రమానికి వెళ్లిపోయారు.

అధికారిక పర్యటన అని ప్రచారం జరిగినప్పటికీ ఆయన పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీని కలవలేదు సగదా ప్రధాని నివాసానికి వెళ్లాలన్న ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారు. ఒక దేశాధినేత రాజధానిలోకి అడుగుపెట్టకుండానే విమానాశ్రయం నుండి వెళ్లిపోవడం పాకిస్థాన్ దౌత్యపరమైన వైఫల్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాక్ మంత్రి అహసాన్ ఇక్బాల్ అంగీకరించడం గమనార్హం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *