మీ పర్సులో ఈ వస్తువులు ఉంచుతున్నారా అయితే దరిద్రం తప్పదు వాస్తు నిపుణుల హెచ్చరిక

వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో కేవలం డబ్బు మాత్రమే ఉండాలి. చాలామంది పర్సులో తాళాలు లేదా లోహపు వస్తువులను ఉంచుతారు, దీనివల్ల అనవసర ఖర్చులు పెరిగి ఆర్థిక నష్టం కలుగుతుంది. పాత బిల్లులు, కరెంటు బిల్లులు పర్సులో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే నోట్లను నలిపి ఉంచడం లేదా చిరిగిన పర్సును వాడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. పర్సులో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదని వాస్తు చెబుతోంది.
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి పర్సులో చిటికెడు బియ్యం లేదా లక్ష్మీదేవి చిన్న ఫోటో ఉంచుకోవడం శుభప్రదం. ఒక ఎర్రటి కాగితంపై మీ కోరిక రాసి పట్టు దారంతో కట్టి పర్సులో ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెండి నాణేన్ని పూజ గదిలో ఉంచి ఆపై పర్సులో పెట్టుకోవడం వల్ల ధనలాభం కలుగుతుంది. అప్పుగా తీసుకున్న డబ్బును పర్సులో కాకుండా విడిగా ఉంచడం వల్ల సంపద నిలకడగా ఉంటుంది.