ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మీ శరీరంలో ఈ 3 మార్పులు కనిపిస్తున్నాయా క్యాన్సర్ ముప్పు కావచ్చు

నేటి పరుగుల జీవితంలో మన శరీరంలో వచ్చే చిన్న మార్పులను నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేవగానే శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలు క్యాన్సర్కు ముందస్తు హెచ్చరికలని పరిశోధనలు చెబుతున్నాయి. చాలా కాలంగా ఉదయాన్నే గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం లేదా ఆహారం మింగడంలో ఇబ్బందిగా అనిపిస్తే అది ఊపిరితిత్తుల లేదా గొంతు క్యాన్సర్ లక్షణం కావచ్చు. దీనిని సాధారణ జలుబుగా భావించి వదిలేయకండి.
రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా ఉదయం విపరీతమైన అలసటగా అనిపిస్తే అది రక్త క్యాన్సర్కు సంకేతం కావచ్చు. అదేవిధంగా, ఉదయం మలవిసర్జన సమయంలో రక్తం పడటం లేదా విసర్జన అలవాట్లలో ఆకస్మిక మార్పులు రావడం పేగు క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ప్రాణాపాయం నుండి రక్షిస్తుంది.