నిజంగానే లడ్డూలు తింటూ పాలు తాగుతూ రామ నామం జపిస్తున్న 700 ఏళ్ల నాటి హనుమంతుడి విగ్రహం

ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా యమునా నది తీరాన ఉన్న పిలువ హనుమాన్ ఆలయం అద్భుతాలకు నిలయంగా మారింది. ఇక్కడ పవళించి ఉన్న బాల హనుమంతుడి విగ్రహం నోరు తెరిచి ఉంటుంది. భక్తులు సమర్పించే లడ్డూలు లేదా పాలు ఆ విగ్రహం నోటిలోకి వెళ్లగానే మాయమైపోతాయి. ఇలా వేల టన్నుల ప్రసాదాన్ని సమర్పించినా ఆ విగ్రహం నోరు నిండకపోవడం విశేషం. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు పురావస్తు శాఖ చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు ఫలితాన్ని ఇవ్వలేదు.
సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి మహాభారత కాలంతో సంబంధం ఉందని చెబుతారు. విగ్రహం నోటి నుండి నిరంతరం వచ్చే బుడగలు హనుమంతుడు రామ నామాన్ని జపిస్తూ శ్వాస తీసుకుంటున్నారనడానికి నిదర్శనమని పూజారులు నమ్ముతారు. పిలువ చెట్టు కింద వెలిసిన ఈ అద్భుత విగ్రహాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ హనుమంతుడిని వేడుకుంటే కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.