అమెరికా కంటే ఈ ముస్లిం దేశం నుంచే అత్యధికంగా భారతీయుల బహిష్కరణ జరిగింది
December 28, 2025

భారతీయులను దేశం నుంచి పంపించివేస్తున్న దేశాల జాబితాలో అమెరికా కంటే సౌదీ అరేబియా మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ 18న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో అమెరికా కంటే సౌదీ అరేబియా నుంచే ఎక్కువ మంది భారతీయులు డిపోర్ట్ చేయబడ్డారు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉండటం మరియు స్థానిక కార్మిక చట్టాలను ఉల్లంఘించడం వంటి కారణాలే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.
గణాంకాల ప్రకారం 2021 నుండి 2025 మధ్య కాలంలో సౌదీ అరేబియా వేల సంఖ్యలో భారతీయులను వెనక్కి పంపింది. ముఖ్యంగా 2023లో ఏకంగా 11,486 మందిని బహిష్కరించగా అమెరికాలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. గల్ఫ్ దేశాలలో నివాస అనుమతులు (ఇకామా) మరియు పని అనుమతుల విషయంలో సౌదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల భారతీయులపై ఈ ప్రభావం పడుతోంది.