సూర్య బ్యాట్‌కు గ్రహణం! వరల్డ్ కప్ ముందు కెప్టెన్‌ను ఆదుకునేందుకు తిలక్ వర్మ ప్లాన్
December 21, 2025

టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. 2025లో ఆడిన 19 మ్యాచుల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేసిన సూర్య, ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేదు. ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్ ఇలా ఫామ్ కోల్పోవడం భారత జట్టులో ఆందోళన కలిగిస్తోంది.
సూర్య ఫామ్‌లోకి రావడానికి సహచర ఆటగాడు తిలక్ వర్మ ఒక కీలక సలహా ఇచ్చారు. సూర్యపై ఒత్తిడి తగ్గించేందుకు తాను రిస్క్ తీసుకుంటానని, సూర్య క్రీజులో సమయం తీసుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని తిలక్ సూచించారు. మరి తిలక్ ప్లాన్ సూర్యను మళ్ళీ మునుపటి ఫామ్‌లోకి తెస్తుందో లేదో చూడాలి.