సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్ అపహరణ! పొగమంచు ముసుగులో బంగ్లాదేశీయుల దుశ్చర్య
December 21, 2025

కూచ్ బెహార్ సరిహద్దులో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో బీఎస్ఎఫ్ జవాన్ వేద్ ప్రకాష్‌ను బంగ్లాదేశీ దుండగులు అపహరించారు. శనివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచును ఆసరాగా చేసుకుని, దుండగులు ఆయనను బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లి అక్కడి సరిహద్దు భద్రతా దళానికి (BGB) అప్పగించారు.
జవాన్ క్షేమంగా ఉన్నారని బిజిబి అధికారులు ధృవీకరించారు. బీఎస్ఎఫ్ సెక్టార్ కమాండర్ వెంటనే బిజిబితో చర్చలు జరిపి జవాన్‌ను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి