అగ్నివీరులకు బంపర్ ఆఫర్! BSF ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్.. కేంద్రం సంచలన నిర్ణయం

అగ్నివీరులకు బంపర్ ఆఫర్! BSF ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్.. కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు కేటాయించిన రిజర్వేషన్‌ను 10 శాతం నుండి ఏకంగా 50 శాతానికి పెంచింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో బీఎస్ఎఫ్ ఖాళీలలో సగం అగ్నివీరులకే దక్కనున్నాయి. ఈ నియామక ప్రక్రియను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహించనుంది.

మొదటి దశలో నోడల్ ఫోర్స్ ద్వారా అగ్నివీరులను భర్తీ చేస్తారు. రెండో దశలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మిగిలిన 47 శాతం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. డిసెంబర్ 18 నుండి అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు అగ్నివీరుల ఉపాధి భద్రతపై నెలకొన్న ఆందోళనలను తొలగించి, వారి భవిష్యత్తుకు భరోసానిస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *