11 రోజుల్లోనే ముగిసిన యాషెస్ కథ! అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్
December 21, 2025

అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో 82 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా, 3-0తో యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు పేలవంగా పెవిలియన్ చేరడంతో ప్యాట్ కమిన్స్ సేన మరోసారి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని గెలుచుకుంది.
జేమీ స్మిత్, విల్ జాక్స్ పోరాడినా.. కీలక సమయంలో వికెట్లు పారేసుకోవడంతో ‘బాజ్‌బాల్’ వ్యూహం విఫలమైంది. వరుసగా ఐదోసారి యాషెస్ గెలిచిన ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని చాటుకోగా, ఇంగ్లాండ్ అతి ఆక్రమణ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.