ISI చిన్న పొరపాటు.. ఇండియన్ ముజాహిదీన్ ఖతం! RAW అల్లిన వ్యూహం ఇదే
December 21, 2025

ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో పాస్‌పోర్ట్‌పై స్టాంపు లేకపోవడం ఉగ్రవాది వకాస్ కొంపముంచింది. అక్కడ ఉన్న ‘రా’ ఏజెంట్ అతని ఫోటో తీసి ఢిల్లీకి పంపడంతో అసలు గుట్టు రట్టయింది. అత్యంత రహస్యంగా అతడిని భారత్‌కు తరలించిన ఏజెంట్లు, అరెస్ట్ చూపకుండా అతని ద్వారానే నెట్‌వర్క్ మొత్తాన్ని వేటాడారు. వకాస్‌తో ఆన్‌లైన్ చాటింగ్ చేయించి, నేపాల్ సరిహద్దులో అతని హ్యాండ్లర్ తెహసీన్ అక్తర్‌ను ట్రాప్ చేసి పట్టుకున్నారు.
అప్పటికే వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ పట్టుబడటంతో బలహీనపడిన ఈ ఉగ్ర సంస్థ, ISI చేసిన చిన్న తప్పుతో పూర్తిగా కుప్పకూలింది. భారత నిఘా వర్గాల సహనం, సమన్వయం కారణంగా ఇండియన్ ముజాహిదీన్ నెట్‌వర్క్ దేశం నుండి తుడిచిపెట్టుకుపోయింది. శత్రువు చేసిన చిన్న పొరపాటును దేశ రక్షణకు ఆయుధంగా మార్చుకున్న భారత ఏజెంట్ల చాకచక్యం ఈ ఆపరేషన్‌తో మరోసారి నిరూపితమైంది.
⏹