ఉల్లిపాయ వెల్లుల్లి చిచ్చు 23 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన ఆహారపు అలవాట్లు

గుజరాత్లో ఉల్లిపాయ, వెల్లుల్లి తినడంపై తలెత్తిన వివాదం కారణంగా 23 ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ దంపతులకు 2002లో వివాహం జరగగా, అప్పటి నుండి ఆహారపు అలవాట్లపై గొడవలు మొదలయ్యాయి. భార్య ‘స్వామినారాయణ’ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారాన్ని కోరుకోగా, భర్త కుటుంబం వాటిని తినడంతో విభేదాలు తలెత్తాయి. కోర్టు ఆదేశాల మేరకు అత్తగారు వేర్వేరుగా వంట చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మతపరమైన నమ్మకాలు, ఆహారపు అలవాట్ల మధ్య ఘర్షణే ఈ విడాకులకు కారణమని కోర్టు పేర్కొంది. భార్య విడాకులకు అభ్యంతరం చెప్పనప్పటికీ, భరణం విషయంలో మాత్రం ఆసక్తి చూపారు. జస్టిస్ విషేన్ మరియు జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం ఈ దీర్ఘకాలిక వివాదానికి ముగింపు పలుకుతూ కుటుంబ కోర్టు నిర్ణయాన్ని ఖరారు చేసింది.