ఐదేళ్లకే తల్లిగా మారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన లీనా మెడినా

ఐదేళ్లకే తల్లిగా మారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన లీనా మెడినా

వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనగా, పెరూకు చెందిన లీనా మెడినా కేవలం ఐదేళ్ల వయసులోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 1933లో జన్మించిన లీనా పొట్ట అసాధారణంగా పెరుగుతుండటంతో కుటుంబ సభ్యులు అది గడ్డ అని భావించారు. కానీ పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించడంతో యావత్ ప్రపంచం షాక్‌కు గురైంది. 1939 మే 14న ఆమె సిజేరియన్ ద్వారా రెండు కిలోల బరువున్న కుమారుడికి జన్మనిచ్చింది.

చాలా చిన్న వయసులోనే శారీరక మార్పులు రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు గుర్తించారు. అయితే లీనా గర్భం దాల్చడానికి గల కారణం లేదా ఆ బిడ్డ తండ్రి ఎవరనే విషయం ఆమె ఎప్పుడూ వెల్లడించలేదు. ఆమె మొదటి కుమారుడు గెరార్డో, లీనాను తన అక్కగానే భావిస్తూ పెరిగాడు. ఆ తర్వాత 1972లో లీనా వివాహం చేసుకుని తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య చరిత్రలో ఈమె ‘ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన తల్లి’గా నిలిచిపోయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *