కాన్వే డబుల్ సెంచరీ విధ్వంసం విండీస్‌పై భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న కివీస్
December 19, 2025

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 461 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే అద్భుతమైన డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతను 31 ఫోర్ల సహాయంతో 227 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ లాథమ్ 137 పరుగులతో రాణించాడు.
ప్రస్తుతం క్రీజులో రచిన్ (22), బ్లండెల్ (3) కొనసాగుతున్నారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ డ్రా కాగా, రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రస్తుత మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో విండీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ భారీ స్కోరుతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది.