బిఈఎల్ లో ఇంజనీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరి గడువు
December 19, 2025

బిఈఎల్ ఆప్ట్రోనిక్ డివైజెస్ లిమిటెడ్ (BELOP) వివిధ విభాగాల్లో 5 కాంట్రాక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బి.ఇ లేదా బి.టెక్ (ఎలక్ట్రానిక్స్, మెకానికల్) పూర్తి చేసి 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు కూడా వర్తిస్తాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ కావడంతో అభ్యర్థులు వెంటనే స్పందించాలని అధికారులు సూచించారు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వెంటనే బిఈఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.