పిల్లలు తమ ప్రైవేట్ పార్ట్స్‌ను పదే పదే తాకుతున్నారా? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే
December 17, 2025

చిన్న పిల్లలు తరచుగా తమ ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడం లేదా లాగడం చేస్తుంటారు, ఇది బహిరంగ ప్రదేశాల్లో తల్లిదండ్రులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, ఇది పూర్తిగా సాధారణ ప్రవర్తన అని పీడియాట్రిషియన్ డాక్టర్ నిమిషా అరోరా తెలిపారు. నాలుగు నెలల వయస్సు నుండే పిల్లలు కళ్లు, ముక్కును ఎలాగైతే తాకుతూ శరీరాన్ని గుర్తిస్తారో, అలాగే ప్రైవేట్ పార్ట్స్ పట్ల కూడా ఉత్సుకత చూపుతారని ఆమె వివరించారు.
ఇలాంటి సమయంలో పిల్లలపై అరవడం లేదా వారిని మందలించడం వల్ల భవిష్యత్తులో వారిలో అపరాధ భావం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు అవగాహన వచ్చే వయస్సులో శరీర భాగాల సరైన పేర్లను నేర్పించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా జరిగినప్పుడు కోప్పడకుండా, శాంతంగా వారి దృష్టిని వేరే పనుల వైపు మళ్లించడం ఉత్తమమైన మార్గమని ఆమె పేర్కొన్నారు.