భార్యతో అక్రమ సంబంధం తమ్ముడిని చంపి తోటలో పాతిపెట్టిన అన్న
December 17, 2025

శివమొగ్గ జిల్లా జేడిగెరె గ్రామంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో రామచంద్ర అనే యువకుడిని అతని అన్న మాల్తేష్ కిరాతకంగా హత్య చేశాడు.
పెళ్లి పూజ నెపంతో తమ్ముడిని తోటలోకి తీసుకెళ్లి మద్యం తాగించిన మాల్తేష్, అనంతరం గొంతు నులిమి చంపేసి ముందుగానే తవ్విన గోతిలో పాతిపెట్టాడు. ఒకటిన్నర నెలలుగా రామచంద్ర కనిపించకుండా పోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసి ఈ ఘోర నేరాన్ని బయటపెట్టారు.