ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ ఈ అవార్డును అందజేశారు. ఇది మోదీ అందుకున్న 28వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం.

ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ దీనిని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. గ్లోబల్ సౌత్ పట్ల మోదీకున్న నిబద్ధతకు మరియు భారత్-ఇథియోపియా దేశాల బలమైన స్నేహానికి ఇది నిదర్శనమని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *