ఆసుపత్రి టాయిలెట్ కమోడ్‌లో నవజాత శిశువు మృతదేహం మధ్యప్రదేశ్‌లో కలకలం

ఆసుపత్రి టాయిలెట్ కమోడ్‌లో నవజాత శిశువు మృతదేహం మధ్యప్రదేశ్‌లో కలకలం

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా పరాసియా సివిల్ ఆసుపత్రిలో ఒక భయంకరమైన ఘటన వెలుగుచూసింది. మహిళా శౌచాలయంలోని కమోడ్‌లో ఓ నవజాత శిశువు మృతదేహం ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు హతాశులయ్యారు. నీరు వెళ్లకపోవడంతో పరిశీలించగా, శిశువు తల మరియు చేయి బయటకి కనిపించాయి. ఈ దృశ్యం చూసిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దాదాపు ఏడు గంటల పాటు శ్రమించిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కమోడ్‌ను పగులగొట్టి శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. బి.ఎమ్.ఓ డాక్టర్ సుధా బక్షి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *