జాగ్రత్త యూపీఐ పేమెంట్ చేస్తున్నారా ఒక్క క్లిక్‌తో 805 కోట్లు మాయం
December 17, 2025

దేశంలో యూపీఐ మోసాలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక ఏడాది నవంబర్ నాటికే సైబర్ నేరగాళ్లు 10.64 లక్షల మంది నుంచి 805 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం సొమ్ము కొంత తగ్గినప్పటికీ, అమాయక ప్రజలే లక్ష్యంగా ఈ దారుణాలు సాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాంకేతిక లోపాల కంటే డిజిటల్ లావాదేవీల రద్దీని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ‘చక్షు’ పోర్టల్ మరియు ఏఐ వ్యవస్థను వినియోగిస్తోంది. మోసపోయిన బాధితులు తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసి తమ సొమ్మును కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.