పాకిస్థాన్ సైన్యంపై బిఎల్ఏ మెరుపు దాడి 12 మంది సైనికులు మృతి
December 17, 2025

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ) పాకిస్థాన్ సైన్యంపై జరిపిన భారీ దాడుల్లో 12 మంది సైనికులు మరణించారు. క్వెట్టా, పంజ్గుర్ ప్రాంతాల్లో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు బిఎల్ఏ కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. పంజ్గుర్‌లో ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్నామని, రెకో డిక్ ప్రాజెక్ట్ వాహనాలపై దాడి చేశామని ఆ సంస్థ ప్రకటించింది.
సైన్యానికి రేషన్ తీసుకెళ్తున్న వాహనాలను బులేడాలో అడ్డుకున్నట్లు బిఎల్ఏ ప్రతినిధి తెలిపారు. పాక్ దళాలకు సహకరించే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఈ దాడుల సమయంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు మరియు పలు ప్రాంతాలపై పట్టు సాధించినట్లు వారు వెల్లడించారు.