ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన ఇథియోపియా
December 17, 2025

ఇథియోపియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరియు ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ ఈ గౌరవాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మొదటి ప్రపంచ దేశాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.
ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తూ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇథియోపియా అభివృద్ధిలో భారతీయ ఉపాధ్యాయుల పాత్రను మరియు ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను ఆయన కొనియాడారు. ఈ పురస్కారం భారత్-ఇథియోపియా స్నేహబంధానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.