ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ పరువు తీసిన భారత్

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ పరువు తీసిన భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో భారత రాయబారి హరీష్ పర్వతనేని ఎండగట్టారు. ఎన్నికైన ప్రధానిని జైల్లో పెట్టడం, రాజకీయ పార్టీలపై నిషేధం విధించడం పాక్ అనుసరిస్తున్న వింత పోకడ అని విమర్శించారు. సైన్యాధిపతికి జీవితకాల రక్షణ కల్పించడం ద్వారా రాజ్యాంగబద్ధమైన తిరుగుబాటుకు పాల్పడుతున్నారని భారత్ మండిపడింది.

జమ్మూ కాశ్మీర్ మరియు సింధు నదీ జలాల ఒప్పందంపై పాక్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపకుండా శాంతి చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ విభజన రాజకీయాలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాల ముందు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *