కోవిడ్ వ్యాక్సిన్ కాదు! యువతలో ఆకస్మిక మరణాలకు అసలు కారణం ఇదే AIIMS వెల్లడి
December 15, 2025

కోవిడ్-19 మహమ్మారి తర్వాత యువతలో అకస్మాత్తు మరణాలు పెరగడం వెనుక కోవిడ్ వ్యాక్సిన్ కారణమనే సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కొట్టిపారేసింది. AIIMS జరిపిన సమగ్ర అధ్యయనంలో, ఈ తరహా ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్ కారణమని నిరూపించడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు ఏవీ లభించలేదని స్పష్టం చేసింది.
AIIMS ప్యాథాలజిస్ట్ డాక్టర్ సుధీర్ అరవా మాట్లాడుతూ, యువతలో ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణం కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా గుండెపోటు అని తెలిపారు. అస్తవ్యస్తమైన దినచర్య, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం మరియు మద్యపానం వంటి జీవనశైలి మార్పులు ఈ గుండె సమస్యల ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతున్నాయి. వదంతులను విశ్వసించకుండా, సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి పెట్టాలని సూచించారు.