ఢిల్లీలో తీవ్ర కాలుష్య సంక్షోభం: AQI 500 దాటి ప్రమాదకర స్థాయికి
December 15, 2025

ఢిల్లీ-ఎన్‌సిఆర్ తో పాటు ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం అదుపు తప్పి తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. రాజధాని ఢిల్లీలో, వాయు నాణ్యత సూచిక (AQI) 500 మార్కును దాటి ‘తీవ్రమైన’ (Severe) కేటగిరీకి చేరుకుంది.
జహంగీర్‌పురి, రోహిణి, వాజిర్‌పూర్, అశోక్ విహార్ వంటి ప్రాంతాల్లో AQI 500గా నమోదైంది. ఈ ప్రమాదకరమైన వాయు కాలుష్యం కారణంగా ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి.