మాజీ అడల్ట్ స్టార్ షాకింగ్ చర్య: భర్తను తల నరికి చంపి, సవతి కొడుకును పెళ్లి చేసుకుంది!

లాస్ వెగాస్‌లో జరిగిన సంచలనాత్మక కేసులో, మాజీ అడల్ట్ ఫిల్మ్ స్టార్ డెవిన్ మైఖేల్స్ (47), తన మాజీ భర్త జోనాథన్ విల్లెట్‌ను క్రూరంగా హత్య చేసినందుకు దోషిగా తేలింది. 2023లో విల్లెట్ తలలేని, రసాయనాలతో కాలిపోయిన మృతదేహం లాస్ వెగాస్‌లోని అతని ఇంట్లో లభించింది. హత్యకు ఉపయోగించిన ఆయుధం లేదా విల్లెట్ తల ఇంకా లభించనప్పటికీ, మైఖేల్స్‌ను ఫస్ట్-డిగ్రీ హత్యకు దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది.
మైఖేల్స్ తరపు న్యాయవాదుల వాదనలన్నింటినీ కోర్టు తిరస్కరించింది. విల్లెట్‌తో విడాకుల తర్వాత, మైఖేల్స్ అతని 29 ఏళ్ల సవతి కొడుకు డేవియర్ విల్లెట్‌ను వివాహం చేసుకుంది. డేవియర్‌కు కూడా ఈ హత్యలో ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానించారు, కానీ అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇద్దరు పిల్లల కస్టడీ దక్కనందున కలిగిన కోపంతోనే మైఖేల్స్ ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.