మెస్సీ విమానం: ₹136 కోట్ల ప్రైవేట్ జెట్‌లో ఏముంది ప్రత్యేకత? తెలిస్తే షాక్ అవుతారు!

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ‘GOAT ఇండియా టూర్ 2025’ కోసం శనివారం అర్ధరాత్రి తర్వాత తన సొంత ప్రైవేట్ జెట్ గల్ఫ్‌స్ట్రీమ్ Vలో ఆయన కోల్‌కతాలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా చలిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది అభిమానులు విమానాశ్రయం వెలుపల వేచి ఉన్నారు. ఆయనతో పాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఉన్నారు. తెల్లటి టీ-షర్టుపై నల్లటి సూట్ ధరించిన మెస్సీని, రన్‌వే నుండి నేరుగా ఆయన హోటల్‌కు తీసుకెళ్లారు.
మెస్సీ భారతదేశానికి వచ్చిన ప్రైవేట్ జెట్ ధర ₹136 కోట్లుగా ఉంది. గల్ఫ్‌స్ట్రీమ్ V (GV) అనేది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, సుదూర ప్రయాణాలకు అనువైన బిజినెస్ జెట్. ఇది ఒక ఖండం నుండి మరొక ఖండానికి నాన్-స్టాప్‌గా ప్రయాణించగలదు. ఇందులో 14 సీట్లు ఉన్నాయి, వీటిని అవసరమైతే 7 విలాసవంతమైన పడకలుగా మార్చవచ్చు. కోల్‌కతా, హైదరాబాద్ పర్యటనల తర్వాత, మెస్సీ ఇప్పుడు ముంబైలో ఉన్నారు. ఆయన పర్యటన సోమవారం ఢిల్లీలో ముగుస్తుంది.