మగవారికే కాదు మహిళలకూ వచ్చేసింది 10 నిమిషాల్లో పనిచేసే ‘లేడీ వయాగ్రా’!

మగవారికే కాదు మహిళలకూ వచ్చేసింది 10 నిమిషాల్లో పనిచేసే ‘లేడీ వయాగ్రా’!

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పురుషుల, మహిళల లైంగిక ఆరోగ్య పరిశోధనలో శాస్త్రవేత్తలు మరో మైలురాయిని చేరుకున్నారు. అమెరికాకు చెందిన హెల్త్ బయోటెక్ గ్రూప్ డేర్ బయోసైన్స్ (Dare Bioscience) కేవలం 10 నిమిషాల్లో పనిచేసే ‘లేడీ వయాగ్రా’ క్రీమ్‌ను అభివృద్ధి చేసింది. సిల్డెనాఫిల్ (sildenafil) అనే రసాయనంతో తయారైన ఈ క్రీమ్ మహిళల్లో లైంగిక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. దీనిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో అత్యంత సానుకూల ఫలితాలు నమోదయ్యాయి. ఈ క్రీమ్ ధర $10 మాత్రమే కావచ్చు.

పురుషులకు పిల్స్ రూపంలో అందుబాటులో ఉన్న సిల్డెనాఫిల్ కంటే క్రీమ్ రూపంలో తక్కువ మోతాదులోనే మెరుగైన ఫలితాలు పొందవచ్చునని, అలాగే దుష్ప్రభావాలు కూడా ఉండవని సంస్థ తెలిపింది. దాదాపు 200 మంది మహిళలపై జరిపిన ట్రయల్స్‌లో వారి లైంగిక ఆసక్తి, కోరికలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం డేర్ బయోసైన్స్ FDA అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. 2026 ప్రారంభం నాటికి అమెరికా అంతటా ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *