పిచ్చుకలు ఇంటికొస్తే రాజభోగం ఖాయమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
December 15, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం, పిచ్చుకలు ఇంటికి రావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తరచుగా పిచ్చుకలు కనిపిస్తే, త్వరలో ఆర్థిక పురోగతి సాధిస్తారని, రాజభోగాన్ని అనుభవించబోతున్నారని అర్థం.
ముఖ్యంగా, జంట పిచ్చుకలు ఇంట్లోకి వస్తే, అతి త్వరలో ఇంట్లో కల్యాణం లేదా సంతానం కలగబోతుందని సంకేతం. పిచ్చుకలు అంతరించిపోతున్న జాతి అయినప్పటికీ, వాటిని తరిమికొట్టడానికి లేదా కొట్టడానికి ప్రయత్నించకూడదు. వాటి రక్షణ కోసం ఆహారం, నీరు అందించడం, కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.