డిసెంబర్ 19న ప్రధాని మారతారు! కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
December 15, 2025

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన సంచలన ప్రకటన భారత రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 19న దేశ ప్రధాని పదవిలో మార్పు వస్తుందని, ఈసారి మరాఠీ వ్యక్తి భారతదేశానికి ప్రధాని అవుతారని ఆయన రెండోసారి ధీమా వ్యక్తం చేశారు. గతంలో పీఎంవోలో పనిచేసిన అనుభవం కారణంగా, ఆయన ప్రకటనను రాజకీయ వర్గాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి.
చవాన్ తన వాదనకు మద్దతుగా జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ మరియు ఇజ్రాయెల్ గూఢచారి స్టింగ్ ఆపరేషన్‌ను ఉటంకిస్తూ, అమెరికా రాజకీయాల ప్రభావం భారతదేశంపై ఉంటుందని సూచించారు. అయితే, బీజేపీ ఈ వాదనలను పూర్తిగా కొట్టివేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గందరగోళం, అస్థిరత సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.