సంచలనం! రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ దేశ తదుపరి ప్రధాన సమాచార కమిషనర్
December 14, 2025

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ దేశ తదుపరి ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ, గోప్యతా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ గోయల్ పేరును సిఫార్సు చేసింది.
1990 బ్యాచ్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాలు (ఏజిఎంయూటీ) కేడర్‌కు చెందిన గోయల్ నియామకం, దేశంలో సమాచార హక్కు చట్టం అమలుకు కొత్త దిశానిర్దేశం చేయనుంది.