8 మందిని మోసం చేసి పరారైన దొంగ పెళ్లికూతురు, హెచ్‌ఐవి పాజిటివ్! వరులంతా ప్రమాదంలో

పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పెద్ద మోసాల ముఠాను పోలీసులు బయటపెట్టారు. డబ్బుపై ఆశతో ఉన్న ఒక మహిళ, ‘దొంగ పెళ్లికూతురు’గా నటిస్తూ, 8 మంది వరులను పెళ్లి చేసుకుని, కొన్ని రోజులకే నగదు, నగలతో పారిపోయింది. ఈ మోసంలో ఆమె భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. వీరంతా నకిలీ బంధువుల్లా నటిస్తూ పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకునేవారు. పెళ్లి వయస్సు దాటినవారినే ఈ ముఠా ప్రధానంగా లక్ష్యంగా చేసుకునేది.
తొమ్మిదో పెళ్లికి ముందే పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి, ఈ ముఠా కుట్రను విఫలం చేశారు. విచారణలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది— ఆ దొంగ పెళ్లికూతురు హెచ్‌ఐవి (HIV) పాజిటివ్. పెళ్లి తర్వాత ఆమె మోసపోయిన వరులతో శారీరక సంబంధం పెట్టుకోవడంతో, ఈ విషయం వారిలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ప్రస్తుతం, ఈ ముఠాలోని ఇతర సభ్యుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు.